BREAKING
ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

పేదల ఆరోగ్య సంరక్షణకు సీఎంఆర్ఎఫ్ దోహదం

Select Suryaa Now
పేదల ఆరోగ్య సంరక్షణకు సీఎంఆర్ఎఫ్ దోహదం

ఏలూరు, సూర్య న్యూస్:పేదల ఆరోగ్య సంరక్షణకు, వారికి ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్నిరకాలుగా మేళ్ళు చేకూర్చడమే తన ధ్యేయమంటూ ఆయన పునరుద్ఘాటించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ, ఎల్‌వోసి కాపీల అందజేత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 34 మంది అనారోగ్యవంతులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 18లక్షల, 68వేల, 55 రూపాయల విలువైన చెక్కులను, అలాగే 8మందికి మంజూరైన 21లక్షల, 81వేల, 668 రూపాయల విలువైన ఎల్‌వోసి కాపీలను బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకూ 871 మంది బాధితులకు మొత్తం 7కోట్ల, 97లక్షల, 60వేల, 89 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, ఎల్‌వోసి కాపీలను, ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ను అందించి, వారిలో భరోసా నింపామన్నారు. కూటమి ప్రభుత్వంతోనే పేదల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయనే యదార్థాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన విషయాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, పనిచేయించుకునే విషయంలో కూటమి ప్రజాప్రతినిధుల్ని, నేతల్ని ప్రజలు నిలదీయాలని, ఓట్లేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కూటమి వైపే చూడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఏఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.

 న్యూస్ బ్యూరో కే బాల సౌరి ఏలూరు