పేదల ఆరోగ్య భద్రతకు సీఎం చంద్రబాబు అందిస్తున్న సహాయలు వెలకట్టలేనివి.. ఎమ్మెల్యే ఆనందరావు..
అమలాపురం మేజర్ న్యూస్ 55.41 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పంపిణి చేసారు
ఇప్పటివరకు అమలాపురం నియోజకవర్గంలో 1,279 మంది బాధితులకు రూ. 8.63 కోట్ల ఆర్థిక సాయం అందించిన కూటమి ప్రభుత్వం అకస్మాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా కుంగిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి' ద్వారా కొండంత ధైర్యాన్ని, భరోసానిస్తోందనిఅమలాపురం శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.
అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఆనందరావు స్వయంగా పంపిణీ చేశారు.ఈ దఫాలో నియోజకవర్గానికి చెందిన *114 మంది బాధితులకు సుమారు రూ. 55,41,999 యాభై ఐదు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిదిందల తొంబై తొమ్మిది రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు అమలాపురం నియోజకవర్గంలో ఏకంగా 1,279 మందికి రూ. 8.63 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించామని తెలిపారు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ.తీవ్రమైన వ్యాధులతో ఆస్పత్రుల పాలై, లక్షలాది రూపాయల వైద్య ఖర్చులు భరించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఈ 'ముఖ్యమంత్రి సహాయ నిధి' ఒక వరప్రసాదంలా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకంగా, ఏమాత్రం ఆలస్యం లేకుండా నిధులు మంజూరు చేస్తూ సీఎం చంద్రబాబు ఎన్నో కుటుంబాలకు పునర్జన్మ నిస్తున్నారు.
ప్రభుత్వ ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల పేదలు అప్పుల పాలవ్వకుండా, ఆరోగ్యంగా తిరిగి సాధారణ జీవితాన్ని గడపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది" అని వివరించారు.కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, నియోజకవర్గంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే ఆనందరావు భరోసా కల్పించారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఆనందరావు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.