పట్టణంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు.
అనకాపల్లి, నవంబర్ 13, మేజర్ న్యూస్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి తన కుటుంబ సభ్యులతో కలిసి పూడిమడక రోడ్‌లోని తమ సొంత స్థలంలో నాగుల చవితి పూజలు నిర్వహించారు. అలాగే ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ప్రాంతంలోని నాగదేవత ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.