BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

పరిషత్ ఫలితాలు నేడే!

Select Suryaa Now
పరిషత్ ఫలితాలు నేడే!
  • ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • నాలుగు మండలాల్లో 78 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు
  • 53 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలపై ఉత్కంఠ
  • మూడు కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • సిబ్బందికి శిక్షణ.. పకడ్బందీ చర్యలు చేపట్టిన అధికారులు

విశాఖపట్నం, సూర్య: విశాఖ జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అభ్యర్థుల భవితవ్యం తేలనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 53 ఎంపీటీసీ, నాలుగు జెడ్పీటీసీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పెందుర్తి మండలంలోని పెదగాడి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నాలుగు మండలాలకు సంబంధించి మొత్తం 78 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆనందపురం ఎంపీడీవో కార్యాలయ నూతన సమావేశ మందిరంలో 20, పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల డైనింగ్ హాలులో 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. భీమిలిలోని సెడార్ పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్‌లో భీమిలి మండలానికి 20, మొదటి అంతస్తులో పద్మనాభం మండలానికి మరో 20 టేబుళ్లను సిద్ధం చేశారు.

  • పారదర్శకంగా ఓట్ల లెక్కింపు

కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు విధానాలు, అనుసరించాల్సిన నిబంధనలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

  •  అభ్యర్థుల్లో ఉత్కంఠ

పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల దృష్టంతా ఫలితాలపై పడింది. ఆయా మండలాల్లో విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. శనివారం ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాల వెల్లడికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.