పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు, పొదలకూరు రోడ్డులోని సెయింట్ జోసెఫ్ పాఠశాల పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్, మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను, ఎన్నికల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.