పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభమైంది,
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభమైందని మాజీ జడ్పిటిసి పోల్నాటి బాబ్జి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్‌చంద్ర శేషు అన్నారు. ఆదివారంమండలంలోని ఏ.పోలవరం, చిన్నవారిగూడెం, తాడువాయి, అక్కంపేట, పట్టణపాలెం గ్రామాల్లో ఆదివారం పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు ఆధ్వర్యంలో సుమారు రూ.1.50 కోట్ల విలువైన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జి, శ్యామ్ చంద్ర శేషు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సారథ్యంలో పల్లెల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీలను నిర్లక్ష్యం చేయగా, కూటమి ప్రభుత్వం గ్రామాలను ప్రగతిపథంలో నడిపిస్తోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో పల్లెల్లో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధిలైట్లతో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గురూజీ వెంకట ఉమామహేశ్వరి, మండల అధ్యక్షుడు ఆకుల రాకేష్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బహుశా సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, క్లస్టర్ ఇన్‌చార్జిలు, గ్రామ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.