andhrapradesh
పల్లెల పరిశుభ్రతకు వినూత్న కార్యక్రమాలు
- గ్రామాల్లో అక్టోబరు 24 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు
- లాంచనంగా ఎరుకొండలో ప్రారంభమైన స్వచ్ఛ రథం
- 10 కిలోల తడి చెత్త సేకరించిన వారికి స్టీల్ సామాన్లు అందజేత
పూసపాటిరేగ, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్: పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ రథం పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లెల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోవడంతో గ్రామాలన్నీ అపరిశుభ్రతకు చిరునామాగా మారింది. దీనితో ప్లాస్టిక్ వ్యర్ధాలు భూములో కలిసిపోయి అనేక అనర్థాలకు దారితీస్తోంది. నీటి నిల్వలు భూములోకి ఇంకక పోవడంతో పాటు వ్యవసాయ భూముల కూడా ఈ వ్యర్థాలను విచ్చలవిడిగా వేయడం వలన పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రామాల్లో తడి పొడి చెత్త లకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న తడి పొడి చెత్త లను ఇళ్ల నుంచి సేకరించి వాటిని సంపద సృష్టి కేంద్రాలకు తరలించి సేంద్రీయ ఎరువులను తయారు చేసే విధంగా ఆయా పంచాయితీ అధికార సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తుండగా, తాజాగా ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా గ్రామాల్లో తడి చెత్తను సేకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 24 వరకు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టే చర్యలు తీసుకుంటుంది. తద్వారా పల్లెలు పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత వలన ఆరోగ్యకర వాతావరణ కూడా ఏర్పడుతుందన్న ఆలోచనను తీసుకురావాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం గా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపడుతుంది. అందులో భాగంగా మండలంలోని ఎరుకొండ పంచాయితీలో స్వచ్ఛ రథాన్ని లాంఛనంగా ప్రారంభించగా 10 కిలోల తడి చెత్త సేకరించిన వారికి అందుకు తగ్గ స్టీల్ సామాన్లు కూడా అందజేసే కార్యక్రమాన్ని ఎంపీడీవో రాధిక నిర్వహించారు. పల్లిలో మరింత పరిశుభ్రతగా ఉండే వాటికి ప్రభుత్వ ప్రత్యేక కమిషనర్ ద్వారా బహుమతులు కూడా అందజేసే కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా స్వచ్ఛరథం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు ఎంపీడీవో రాధికా వివరించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్న వారంతా సహకరించినట్లయితే పల్లెలు పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా మారుతాయి అన్న ఆశాభావాన్ని ఎంపీడీవో రాధిక వ్యక్తం చేశారు.