పల్లె పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు...అబ్బూరి రమేష్ నాయుడు
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ : పల్లె పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ మండల కన్వీనర్ అబ్బూరి రమేష్ నాయుడు పేర్కొన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ఎండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చి పల్లె పండుగను విజయవంతం చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.