పల్లె పండుగ–3.0లో కొమరోలు మండలంలో రూ.9.35 కోట్ల అభివృద్ధి పనులు.
కొమరోలు,
పల్లె పండుగ–3.0 పథకంలో భాగంగా కొమరోలు మండలంలో రూ.9.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం శ్రీకారం చుట్టారు. మండలం మొత్తం మీద రూ.1.20 కోట్లతో CC రోడ్లు, రూ.8.15 కోట్లతో BT రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజుపాలెం, బొడ్డువానిపల్లి, వత్తివేపమానుపల్లె, మిట్టమీదపల్లి, కొమరోలు పట్టణం, తాటిచెర్ల తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బాదినేనిపల్లిలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.
*పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు మరియు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.