BREAKING
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

పదో తరగతి ఫలితాలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ

Select Suryaa Now
పదో తరగతి ఫలితాలే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ


మెలియాపుట్టి. నవంబర్ 13. మేజర్ న్యూస్...
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఈఓ పద్మనాభరావు సూచించారు. పరీక్షల సమయం దగ్గర పడిన తర్వాత హడావుడి పడకుండా ఇప్పటి నుంచే పాఠ్యాంశాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలని హితవు పలికారు.
మెలియాపుట్టి మండలం పెద్దమడిలోని ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాలలో మిషన్‌ మార్చ్‌–2027 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ విద్యార్థులతో మాట్లాడి పరీక్షల సన్నద్ధత, చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, సబ్జెక్టులపై వారికున్న అవగాహన తదితర అంశాలను తెలుసుకున్నారు.
ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై సమానంగా శ్రద్ధ చూపాలని, కష్టంగా భావించే పాఠ్యాంశాలకు అదనపు సమయం కేటాయించాలని సూచించారు. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయపట్టికను రూపొందించుకుని దాని ప్రకారం చదువుకోవాలని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే అంశాలను అదే రోజు ఇంటి వద్ద పునశ్చరణ చేసుకోవడం ద్వారా పాఠ్యాంశాలపై పట్టు సాధించవచ్చన్నారు.
గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను నిరంతరం సాధన చేయాలని, ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి పదేపదే చదవాలని సూచించారు. కేవలం చదవడానికే పరిమితం కాకుండా సమాధానాలను సొంతంగా రాసి చూసుకోవాలని, రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ఏ అంశంలోనైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను సంప్రదించి వెంటనే నివృత్తి చేసుకోవాలని వివరించారు.పరీక్షలంటే భయాందోళనలకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు. మిషన్‌ మార్చ్‌–2027 లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఎంఈఓ సూచించారు.