BREAKING
బాలకృష్ణ 'దాదా' మూవీ షూటింగ్ అప్‌డేట్.. క్రిస్మస్ బరిలో దిగుతున్న నటసింహం పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు పంపిణీ తుర్కియే అధ్యక్ష ఎన్నికలపై సంచలన చర్చ...2028లో ఎర్డోగన్ ముందస్తు పోటీకి లైన్ క్లియర్? జిన్నారం మున్సిపల్ బీజేపీ నూతన కమిటీ ఏర్పాటు పార్టీ పదవులు, అనుబంధ మోర్చాల అధ్యక్షుల నియామకం జిన్నారం మేజర్ న్యూస్:జిన్నారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మున్సిపల్ కమిటీతో పాటు అనుబంధ మోర్చాల అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యాలయంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్ అద్దంకి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధం. మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాలపై హూతీల దాడి యత్నం కురుమ యువ చైతన్య సమితి(కెవైసిఎస్) మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జిగా బండారు శ్రీనివాస్ కురుమ నేటి నుండి నామినేషన్ లు. ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ నిఘా: తనిఖీలు, పాత నేరస్తులకు హెచ్చరికలు. గురువారం సంతలో ఏ ఊరు వారైనా ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు: సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ శివాలయం అవినీతి ఆరోపణలు నిరూపించండి నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ! దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం -ఎమ్మెల్యే ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి :సబితా రెడ్డి

పదవీ విరమణ ఉద్యోగానికే కానీ.. ప్రజాభిమానానికి కాదు

Select Suryaa Now
పదవీ విరమణ ఉద్యోగానికే కానీ.. ప్రజాభిమానానికి కాదు

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ, బదిలీలు సర్వసాధారణమని, అయితే ప్రజల నుంచి పొందే అభిమానానికి, ఆదరణకు ఎప్పటికీ పదవీ విరమణ ఉండదని పి.ఎం.పి. జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, (ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కొండాయపాలెం గేట్ సెంటర్లోని ఒక హోటల్ నందు ఎనిమిది సంవత్సరాల క్రితం నెల్లూరు  టౌన్ డీఎస్పీగా విధులు నిర్వహించిన ఎన్.బి.ఎం. మురళీకృష్ణ, పదవీ విరమణ అనంతరం వ్యక్తిగత పనిమీద నెల్లూరుకు వచ్చిన సందర్భంగా ఆయనను పీఎంపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాఖవరపు వేణుగోపాల్ మాట్లాడుతూ, మురళీకృష్ణ తనవిధి నిర్వహణలో ప్రతిఒక్కరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ప్రజలతో మమేకమై, తన అధికారిక బాధ్యతలతో పాటు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులు తమవిధి నిర్వహణ ద్వారా ప్రజల మన్ననలు పొందడం గొప్ప విషయమని, అలాంటి వ్యక్తులను గౌరవించడం సమాజంలో సేవాభావాన్ని మరింత పెంపొందిస్తుందని శాఖవరపు వేణుగోపాల్ తెలిపారు. మురళీకృష్ణ సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయనకు అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ 100 ఆదివారాలు కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో నిర్వహిస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు, ర్యాలీలు గురించి మురళీకృష్ణ కు వివరించారు.

మాదకద్రవ్యాల వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు తెలియజేస్తున్న పీఎంపీల సేవలు ఎంతో అభినందనీయం

విశ్రాంత ఏఎస్పి ఎన్.బి.ఎం. మురళీకృష్ణ ఈ సందర్భంగా
మాట్లాడుతూ...నేడు యువత మాదకద్రవ్యాలు బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ కు "నో" చెప్పి మంచి భవిష్యత్తుకు "ఎస్" చెప్పాలని కోరారు. అలాగే  గ్రామాల్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే ఈగల్ సెల్ 1972 కు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని పీఎంపీలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. గ్రామాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రాధమికంగా ప్రధమ చికిత్సలందించే పీఎంపీలు సామాజిక సృహతో కూడిన కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఎంపీ నాయకులు గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ అనుముల జయప్రకాష్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, జిల్లా పీఎంపీ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, దేవరకొండ శ్రీనివాసులు, బి.శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.