పారిజాత గిరిలో వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విజయదశమి, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారి కల్యాణోత్సవాన్ని మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో మణికల రాంబాబు తెలిపారు. అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పది జంటలు కల్యాణ దాతలుగా పాల్గొన్నారు.
కల్యాణ దాతలకు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, రుషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.