ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్
జగ్గయ్యపేట మేజర్ న్యూస్:-జగ్గయ్యపేట పట్టణం లోని సీతారాంపురం మండల పరిషత్ బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి నెట్టెం రఘురాం, నెట్టెం శివరామ్
జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీతారాంపురం మండల పరిషత్ బాయ్స్ హైస్కూల్
లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రివర్యులు, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరామ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, ప్రజల చేతిలో ఉన్న అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన శక్తి ఓటు హక్కు అని పేర్కొన్నారు. పట్టణ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ప్రజల నిర్ణయం ఎంతో కీలకమని తెలిపారు.
ఓటు వేయడం కేవలం ఒక ప్రక్రియగా భావించకుండా, ప్రతి పౌరుడు తన సామాజిక బాధ్యతగా గుర్తించాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా