ఓటమి ఎరుగని పద్మావతమ్మ
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి దపా విజయం సాధించి ఓటమి ఎరుగని నాయకురాలుగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెం సెగ్మెంట్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్గా విజయం సాధించిన చెరుకూరి పద్మావతమ్మ నిలిచారు. ఆమె గతంలో ఆత్మకూరు మండల జడ్పిటిసి సభ్యురాలుగా పోటీ చేసి విజయం సాధించారు. మరో దపా ఆత్మకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పద్మావతమ్మ 27వ వార్డు నుండి టిడిపి అభ్యర్థిగా మున్సిపల్ కౌన్సిలర్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. అనాదిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుచర నాయకురాలుగా ఉన్న పద్మావతమ్మ ఆయన ఆశీస్సులతోనే ఈ దపా కూడా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఆశీస్సులతోనే గతంలో కూడా మండల జడ్పిటిసి మెంబర్గా మున్సిపల్ కౌన్సిలర్ గా విజయం సాధించారు. మూడోదపా కూడా ఆమె గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన చెరుకూరు పద్మావతమ్మ మండల తెలుగుదేశం పార్టీలో సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ దపా జరిగిన హోరాహోరీ పోటీలో పద్మావతమ్మ తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో పోటీ చేసి విజయం సాధించారు. ఓటమి ఎరుగని నాయకురాలుగా అందరూ చర్చించుకుంటున్నారు.