BREAKING
వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ ఎంపీ చెరువులో అభివృద్ధి పరుగులు.. ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ ముంబైకి గుడ్‌బై చెప్పనున్న ప్రముఖ జంట: సొంతూరికి మకాం మార్చనున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి. సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా ‘Goree Whitening Soap’ విక్రయం

నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

Select Suryaa Now
నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

రాయవరం మేజర్ న్యూస్ : రాయవరం మండలం, రాయవరం గ్రామంలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులకు శనివారం ఘనంగా శంఖుస్థాపన నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.93 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  ముఖ్య అతిథిగా విచ్చేసి, శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గతంలో ఉన్న పాత ఆసుపత్రి భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఆ పాత భవనాన్ని తొలగించి రూ.1.93 కోట్లతో ఆధునిక వసతులతో  నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. రాయవరం పరిసర ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. పాత భవనం స్థానంలో కొత్త ఆసుపత్రి రూపుదిద్దుకోనుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉండవల్లి రాంబాబు, వల్లూరి శ్రీనివాస్, చల్లా సత్యనారాయణ, బర్ల రాజు, నేతల సురేష్, కందుకూరి గంగరాజు, ఇందుకుమిల్లి అరుణ్ కుమార్, జనసేన నాయకులు దేవిశెట్టి కోటేశ్వరరావు, బీర వరప్రసాద్, తూము చక్రధరరావు, పట్నాల జగదీష్, హాస్పటల్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు