BREAKING
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి 8న పర్చూరులో మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటన విజయవంతం చేయాలి మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి వెల్లడి కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం!

నూతన ఎరువుల విక్రయ విధానం (ఎఫ్ ఎఫ్ ఎస్ )పై శిక్షణ మరియు సమీక్ష సమావేశం జిల్లా వ్యవసాయ అధికారిణి పి. సత్యవాణి

Select Suryaa Now
నూతన ఎరువుల విక్రయ విధానం (ఎఫ్ ఎఫ్ ఎస్ )పై శిక్షణ మరియు సమీక్ష సమావేశం  జిల్లా వ్యవసాయ అధికారిణి పి. సత్యవాణి

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్   :  జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  ఎరువుల విక్రయ విధానం – ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ (ఫ్రేమవర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ )పై శిక్షణ మరియు సమీక్ష సమావేశం కృషి భవన్, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నెల్లూరులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం   జిల్లా వ్యవసాయ అధికారిణి పి. సత్యవాణి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏలు), మండల వ్యవసాయ అధికారులు (ఎంఏఓలు) పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కోవూరు ఏడీఏ  జి. అనిత, వింజమూరు ఏడీఏ  ఎం. శేషగిరి మాస్టర్‌ ట్రైనర్లుగా నూతన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంపై శిక్షణ అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో డీడీఏ, డీఆర్‌సీ  వి. సుమలత, ఏడీఏ, డీఏఓ కార్యాలయం డి. సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ అంటే ఏమిటి?   ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ అనేది రైతు రిజిస్ట్రీ (ఏ పి ఎఫ్ ఆర్ ), భూ రికార్డులు మరియు ఎరువుల నిర్వహణ వ్యవస్థలను అనుసంధానం చేసే డిజిటల్ విధానం. దీని ద్వారా సబ్సిడీ ఎరువులు నిజమైన సాగుదారులకు పారదర్శకంగా, సౌకర్యవంతంగా అందేలా చర్యలు తీసుకుంటారు.

రైతులకు ప్రత్యేక సౌకర్యం :   ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో రైతులు తమ ఆధార్ లేదా ఫార్మర్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అయి, తమ భూమి వివరాలను పరిశీలించుకోవచ్చు. భూమి వివరాలు అందుబాటులో లేకపోతే ‘యాడ్‌/క్లెయిమ్‌ ల్యాండ్‌’ ద్వారా భూమి వివరాలను జోడించుకునే అవకాశం ఉంటుంది.  రైతులు యాప్‌లో తమ పంటను ఎంపిక చేసుకుని, తమకు అవసరమైన ఎరువులను మరియు ఎరువుల పరిమాణాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం తమకు అనుకూలమైన డీలర్‌/రిటైలర్‌ను ఎంపిక చేసుకుని ఎరువుల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.  ఎరువులు కొనుగోలు చేయడానికి ముందుగానే డీలర్‌ వారీగా, ఎరువు రకం వారీగా అందుబాటులో ఉన్న నిల్వ వివరాలను తెలుసుకునే సౌకర్యం కూడా యాప్‌లో ఉంటుంది. తద్వారా రైతులు తమకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్న డీలర్‌ను ముందుగానే ఎంపిక చేసుకుని సౌకర్యవంతంగా కొనుగోలు చేసుకోవచ్చు.

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా ప్రక్రియ  :   యాప్‌ను తెరిచి రాష్ట్రాన్ని ఎంపిక చేసి ఆధార్/ఫార్మర్‌ ఐడీతో లాగిన్‌ అయిన తరువాత, భూమి వివరాలు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడతాయి. అనంతరం రైతు పంటను, అవసరమైన ఎరువులను, పరిమాణాన్ని మరియు రిటైలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కొనుగోలు ప్రక్రియ కోసం క్యూఆర్‌ కోడ్‌ రూపొందించుకోవచ్చు.
రైతు తన తరపున మరొక వ్యక్తి ద్వారా ఎరువులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ప్రయోజనాలు

* నిజమైన సాగుదారులకు ఎరువులు అందేలా చేయడం.
* ఎరువుల లభ్యతను ముందుగానే తెలుసుకునే అవకాశం.
* రైతుకు నచ్చిన డీలర్‌/రిటైలర్‌ను ఎంపిక చేసుకునే సౌకర్యం.
* ముందుగానే ఎరువుల కోసం ప్రక్రియ పూర్తి చేసుకోవడం ద్వారా క్యూలైన్లు, పానిక్‌ బయ్యింగ్‌ తగ్గించడం.
* ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంపొందించడం.
* వ్యవసాయేతర వినియోగాన్ని అరికట్టేందుకు సహకరించడం.

రైతులు ఎలా యాప్‌ పొందాలి?  రైతులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి “ ఎఫ్ ఎఫ్ ఎస్ – ఫ్రేమవర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ ” యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ కావచ్చు.  యాప్‌లో లాగిన్‌ అయిన తరువాత రైతులు తమ భూమి వివరాలను జోడించుకుని, పంటను నమోదు చేసి, తమకు కావాల్సిన ఎరువులను మరియు తమకు అనుకూలమైన డీలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ యొక్క ప్రత్యేకతగా అధికారులు తెలిపారు.  ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ వినియోగం, భూమి వివరాల నమోదు, ఎరువుల ఎంపిక మరియు కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం రైతులు సమీప రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) లేదా మండల వ్యవసాయ అధికారిని (ఎంఏఓ) సంప్రదించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సూచించారు.