ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సంస్థాగత ఆవిష్కరణల మండలి ఆధ్వర్యంలో హోమ్ సైన్స్, నర్సింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల సంయుక్త సహకారంతో సమస్యల పరిష్కారం, నూతన ఆలోచనల రూపకల్పన అంశంపై శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఎన్ ఏ ఆర్ ఎల్ మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైభవాని కుమార్ పాల్గొని సమస్యలను గుర్తించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, వినూత్న పరిష్కారాలను కనుగొనడం, వాటిని ఆచరణలో పెట్టడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
వివిధ విభాగాలకు చెందిన 40 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని కల్పన లక్ష్యంగా చేపట్టారు. ఐఐసీ కన్వీనర్ ప్రొ.ఎం.కుమారి చిట్టూరి,
డా.పి.స్నేహలత, డా.డి.మాధవి, యు.సుహాసిని పాల్గొన్నారు.