andhrapradesh
నూనెగింజల జాతీయ మిషన్ ద్వారా గ్రామాల అభివృద్ధి
- కొత్తూరు మండల అల్తీ పంచాయతీ లో రైతులకు శిక్షణ
కొత్తూరు: పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం అల్తీ పంచాయతీ తామర గూడలో నూనె గింజల జాతీయ మిషన్ క్రింద గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వనరులు కేంద్రం రబి 2026 -27సీజన్ నువ్వులు పంట పై మేలైన యజమాన్య పద్ధతులుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నువ్వులు పంటలో ఎరువులు యజమాన్యం పద్ధతులు ,పురుగు తెగుళ్లు యాజమాన్యం గూర్చి గిరిజన రైతులకు తెలియచేసి రైతుల యొక్క సాగుసమస్యలకు శాస్త్రవేత్తలు తగిన పరిష్కార సూచనలు తెలియజేశారు.అదేవిధం గా ప్రస్తుత ఖరీఫ్ వరి పంటలో సాగు సమస్యలు గూర్చి రైతులతో శిక్షణ కార్యక్రమంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వనరుల కేంద్రం డెప్యూటీ డైరక్టర్ వ్యవసాయ శాఖ ఆర్ శ్రీనివాసరావు ,కొత్తూరు సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి రాజగోపాల్,సీతంపేట వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త జి చిట్టిబాబు ,జిల్లా వనరులు కేంద్రం వ్యవసాయ అధికారి వై సురేష్,మండల వ్యవసాయ అధికారి సుమంత్ ,వి ఏ ఏ లక్ష్మి కళ్యాణి,రైతులు పాల్గొన్నారు.