నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు
అనకాపల్లి ప్రతినిధి, అక్టోబర్ 04, మేజర్ న్యూస్:అనకాపల్లి పట్టణంలోని నూకాంబికా అమ్మవారిని హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. ఆలయానికి చేరుకున్న హోం మంత్రి అనితకు స్థానిక నాయకులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనిత అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు హోం మంత్రి అనితకు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని మంత్రికి బహూకరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనితతో పాటు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కూడా నూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.