నెల్లూరు నగరంలో వైసీపీ బలం చూపించడమే లక్ష్యం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటిచెప్పేలా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరిగాయి. కాసేపటి క్రితం జరిగిన ఈ సమావేశంలో నెల్లూరు నగరంలో పార్టీ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడం, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. నెల్లూరు నగరంలో వైసీపీ బలం ఏమిటో చూపిస్తామని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.