BREAKING
ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

డివిజన్ అభివృద్ధికి కూటమి గెలిపించండి -జనసేన నేత ప్రణీత్ పెనుమాదు పిలుపు

Select Suryaa Now
డివిజన్ అభివృద్ధికి కూటమి గెలిపించండి  -జనసేన నేత ప్రణీత్ పెనుమాదు పిలుపు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : 63వ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన పుష్పవతిని గెలిపించి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని జనసేన పార్టీ నాయకులు ప్రణీత్ పెనుమాదు పిలుపునిచ్చారు. మంగళవారం 63వ డివిజన్ పరిధిలో ఆయన టిడిపి రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత, అన్నా రామకృష్ణ, యువరాజు రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో మాట్లాడుతూ డివిజన్ సమస్యలపై అవగాహన కలిగి ఉన్న పుష్పవతి కుటుంబాన్ని ఆదరించాలని ఆదరించాలని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. నగర అభివృద్ధి జరగాలంటే కూటమి వైపు ఓటర్లు మొగ్గుచూపి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముందుగా అక్కడికి విచ్చేసిన ఆయన వారితో కలిసి అంబేద్కర్ కు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ప్రచారంలో భాగంగా ప్రణీత్ 63వ డివిజన్ కు చేరుకోగానే జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమినేతలు ప్రణీత్ అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పూలమాలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన ప్రచార సామాగ్రిలో భాగంగా జనసేన స్టిక్కర్లను ఆవిష్కరించి డివిజన్లో ఇంటింటికి అంటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు యువరాజు రెడ్డి, జెబి రమణ, శ్రీనివాస యాదవ్, కేఎంకే లోకేష్, ఈశ్వర్, శివ, లక్ష్మి, శశిరేఖ, దేవి, తేజ, భువన, స్థానిక మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్