మండల జెడ్పిటిసి టిడిపి కైవసం
సీతారామపురం మేజర్ న్యూస్ : మండల జడ్పిటిసి పీఠాన్ని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. జడ్పిటిసిగా కుర్ర వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. ఆమె భర్త కుర్ర తిరుపతయ్య సైతం పబ్బులేటిపల్లి ఎంపిటిసిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కుర్రా రత్తయ్య మాట్లాడుతూ తమకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చి ఏకగ్రీవంగా సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. మండల తెలుగుదేశం పార్టీ రథసారథి అధ్యక్షులు చింతల శ్రీనుకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని అహర్నిశలు ప్రజల్లో ఉంటూ తమకు ఇచ్చిన పదవులకు వన్నె తెస్తామని తెలిపారు.