BREAKING
ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!. థేల్స్ కంపెనీ సివిల్, మిలిటరీ రాడార్ వ్యవస్థల ఎంపిక

తుఫాను తీవ్రత పెరగకుండానే ముందే అంధకారంలో పరవాడ

Select Suryaa Now
తుఫాను తీవ్రత పెరగకుండానే ముందే అంధకారంలో పరవాడ

తుఫాను తీవ్రత పెరగకుండానే ముందే అంధకారంలో పరవాడ 
-తుఫాను తీవ్రత పెరగకుండానే ముందే అంధకారంలో పరవాడ 
-విద్యుత్ అధికారుల తీరుతో రోజంతా విద్యుత్ కోత 
తీవ్ర ఇబ్బంది పడుతున్న వినియోగదారులు

విద్యుత్ అధికారుల తీరుతో పరవాడకు తుఫాను రాకముందే అంధకారంలోకి చేరుకుంది. మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పరవాడలోను, మండలంలో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తుఫాను చర్యలులో భాగంగా ముందుగానే లైన్లు సరిచూసుకోమని , తప్పని పరిస్థితి ఏర్పడితే తప్ప విద్యుత్ నిలుపుదల చేయకూడదని అధికారులు చెబుతున్న  
పరవాడలో మాత్రం కనిపించలేదు. ఉదయం నుండి విద్యుత్ సరఫరా ఆగిపోవడం రాత్రి కూడా రాకపోవడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో కూడా స్థానికంగా ఉన్న అధికారులు, సిబ్బంది చెప్పలేకపోవడం చాలా విచిత్రకరంగా ఉందని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని అంటూ పరవాడలో అనధికారకంగా విద్యుత్ కోత పెట్టడం విద్యుత్ అధికారులకు తీరుకు అర్థం పడుతుంది. తుఫాను తీవ్రత ఎక్కువ అయినప్పుడు విద్యుత్ కోత విధించిన పర్వాలేదు కానీ చిరుగాలులు, చిన్నపాటి వర్షానికి పూర్తిస్థాయిలో విద్యుత్ ఆపేసి వినియోగదారులను విసిగిస్తున్న విద్యుత్ అధికారులుపై ఉన్నతాధికారులు తగిన విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై అనకాపల్లి ఆపరేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ ను వివరణ కోరడానికి ప్రయత్నించిన ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ఫోన్ లైన్ కలవలేదు.