BREAKING
ఇద్దరు టిడిపి సభ్యులు ఏకగ్రీవం రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

ఆత్మకూరు స్థానిక ఎన్నికల్లో ‘ఆనం హవా’.. 30 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఏకగ్రీవం

Select Suryaa Now
ఆత్మకూరు స్థానిక ఎన్నికల్లో ‘ఆనం హవా’.. 30 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఏకగ్రీవం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.  నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలకు గాను 30 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..
మొత్తం స్థానాల్లో 45 శాతం స్థానాలు పోలింగ్‌కు ముందే ఏకగ్రీవం కావడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
మండలాల వారీగా ఏకగ్రీవ స్థానాల వివరాలను చూస్తే 
మర్రిపాడు మండలం – 7 స్థానాలు
మర్రిపాడు, సింగనపల్లి, భూదవాడ, నందవరం, పొంగూరు, భీమవరం, ఏపిలగుంట ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చేజర్ల మండలం – 9 స్థానాలు
టీకేపాడు, పాడేరు, మాముడూరు, నెర్నూరు, వావిలేరు, పుట్టుపల్లి, నాగులవెల్లటూరు, తూర్పుపల్లి, మడపల్లి ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సంగం మండలం – 6 స్థానాలు
పడమటిపాలెం, మర్రిపాడు, వంగల్లు, పెరమన, కొరిమెర్ల, జండాదిబ్బ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనుమసముద్రంపేట మండలం – 4 స్థానాలు
గుంపర్లపాడు, సీబీవరం, హసనాపురం, చిరమన ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతసాగరం మండలం – 3 స్థానాలు
బొమ్మవరం, దేవరాయపల్లి బిట్‌–1, ఆమనిచిరువెళ్ల ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆత్మకూరు మండలం 
చెర్లోయడవలి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నేపథ్యంలో 30 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని మంత్రి ఆనం నాయకత్వంలో సాధించిన విజయాలతో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా భూస్థాపితం తప్పదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక నాయకుల సమన్వయమే ఈ ఫలితాలకు కారణమని 
నియోజకవర్గంలోని 67 ఎంపీటీసీ స్థానాల్లో 30 స్థానాలు ఏకగ్రీవం కావడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు విశేష విజయంగా అభివర్ణిస్తున్నారు.

మర్రిపాడు, చేజర్ల మండలాల్లో అత్యధిక సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవం కావడంతో పాటు సంగం, ఏఎస్‌పేట, అనంతసాగరం, ఆత్మకూరు మండలాల్లోనూ మెజారిటీ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహాన్ని నింపింది.