BREAKING
రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం

అభివృద్ధి లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం

Select Suryaa Now
అభివృద్ధి లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు పట్టణంలోని 11,12వార్డుల్లో మంగళవారం రాత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముమ్మరంగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యంగా, ప్రజా సంక్షేమం సంకల్పంగా కృషి చేస్తున్నామని రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.గతంలో, గత రెండేళ్లలో ఆత్మకూరులో అభివృద్ధి పనులకు విశేష ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి ఆనం పేర్కొన్నారు.  117 కోట్లతో సిమెంట్ రోడ్లు, తాగునీటి పనులు,పట్టణ మౌలిక సదుపాయాల బలోపేతానికి చర్యలు తీసుకున్నామని,  100 పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, బాలికల గురుకుల పాఠశాల, బైపాస్ రోడ్డు, నాలుగు లైన్ల రహదారి వంటి అభివృద్ధి పనులకు కృషి చేశామని మంత్రి ఆనం పేర్కొన్నారు.ఆత్మకూరు మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండని మంత్రి ఆనం విజ్ఞప్తి చేశారు.  చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నామన్నారు.  ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంత్రి ఆనం  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 12వ వార్డు అభ్యర్థి గడ్డం అమరావతి, 11వ వార్డు అభ్యర్థి కొలగాని ప్రశాంతికి మద్దతుగా ఓటర్లను కలుసుకుని, ఆత్మకూరు అభివృద్ధికి ఎన్డీఏ కూటమికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి గతంలోనూ, ముఖ్యంగా గత రెండేళ్లలో తమ ప్రభుత్వ హయాంలోనూ విశేష ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.

ఆత్మకూరులో 100 పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు వంటి ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేశామని వివరించారు. సోమశిల జలాలను ఆత్మకూరుకు తీసుకురావడంతో పాటు బైపాస్ రోడ్డు ఏర్పాటు, నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి, మెరుగైన రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు.  ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.117 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.  ఆత్మకూరు అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సహకరిస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు. అభివృద్ధి పనుల కోసం అదనంగా నిధులు అవసరమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, రూ.29 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సూచించారని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.  ఆత్మకూరు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.  ప్రజలను మాయమాటలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను నమ్మవద్దని మంత్రి ఆనం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు అభివృద్ధి కోసం ఎవరు ఏమి చేశారో ప్రజలు ఆలోచించాలని, పట్టణ ప్రగతికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.  ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే సంకల్పంతో తాను ప్రజల ముందుకు వచ్చానని, ఆత్మకూరు మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి మరింత వేగంగా కృషి చేస్తామని తెలిపారు.  ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటుతో మద్దతు అందించాలని మంత్రి ఆనం రామనా రాయణరెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తాళ్లూరు గిరినాయుడు, తుమ్మల చంద్రా రెడ్డి, కేతా విజయభాస్కర్ రెడ్డి, కేతా వేణుగోపాల్ రెడ్డి, టిడిపి అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.