నేడు శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం, వరుణ జపం
పాలకొండ: దేవాదాయ – ధర్మదాయ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నగరపంచాయితీలోని కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఉదయం 6.54 గంటల నుండి "వరుణ జపం - వరుణ యాగం" కార్యక్రమం నిర్వహించబడును. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నందున సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు, రాష్ట్ర మరియు దేశ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కొరకు వరుణ దేవుని ఆశీస్సులను పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాలలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ దేవస్థానంలో కూడా యాగం నిర్వహిస్తున్నారు. కావున యావన్మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మి ప్రసాద్ శర్మ, కార్యనిర్వహణాధికారి వి.వి. సూర్యనారాయణ తెలిపారు.