నేడు ఇంకొల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్న మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ర్ట రెవెన్యూ శాఖా మాత్యులు అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు శ్రీకారం చుట్టనున్నారు. 3 గంటల నుండి ఇంకొల్లు మండలంలో పర్యటన కొనసాగుతుందని ఇంకొల్లు మండల పార్టీ అధ్యక్షులు నాయుడు హనుమంతరావు తెలిపారు. ఇంకొల్లు, పావులూరు, నాగండ్ల గ్రామాలలో పలు ప్రారంభోత్సవాలు, శంఖస్థాపనలు, నూతన ఇళ్ల పట్టాలు మంజూరు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని హనుమంతరావు కోరారు.