నేడు భైరవకోనలో వరుణయాగం
సిఎస్ పురం,మేజర్ న్యూస్: ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోనలో కరవకాటాకలు లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురావలని భక్తజనకోటి గురించి రాష్ట్రప్రభుత్వం దేవాదాయశాఖ సూచనలతో మంగళవారం వరుణయాగం నిర్వహిస్తున్నట్లు భైరవకోన ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి తెలిపారు.ఈసందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన హోమమండపం నందు అర్చకుల బృందం హోమపూజలు నిర్వహిస్తున్నట్లు అనంతరం వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు కావున భక్తులు ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని భైరవకోన సందర్శించి వరుణయాగం పూజలను విజయవంతం చేయాలని భైరవకోన ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,ఈఓ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.