BREAKING
యూరోపియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరియు అనిశ్చితి చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి జెండా..... భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు.. మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..* భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు. *విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంపై చైనా కోర్టులో కోవిడ్ అపవాదుపై పరువు నష్టం దావా 2030 నాటికి వార్షిక విక్రయాల్లో నిలకడైన వృద్ధి లక్ష్యం పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు* ట్రంప్ ఒత్తిడితో వెనక్కి తగ్గిన ఒరాకిల్ ఐదుసార్లు గెలిచిన సూజన్ కాలిన్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన డెమోక్రాట్ ట్రాయ్ జాక్సన్

నేడే పుర తీర్పు: కౌంటింగ్ కి ఏర్పాట్లు చేసిన అధికారులు ,,,

Select Suryaa Now
నేడే పుర తీర్పు: కౌంటింగ్ కి ఏర్పాట్లు చేసిన అధికారులు ,,,

రామచంద్రపురం మేజర్ న్యూస్:రామచంద్రపురం పురపాలక ఎన్నికల్లో నేడు జరిగే కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు పట్టణంలోని చింతపల్లి సువర్ణ నగర్ ఇందిరా గాంధీ మున్సిపల్ హై స్కూల్ నందు కౌంటింగ్ నకు సహాయ ఎన్నికల అధారిటీ కె.వి.ఆర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాటు చేశారు పట్టణంలో 32 వార్డులు ఉండగా 50 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 1న ఎన్నికలను నిర్వహించారు. అనంతరం చింతపల్లి సూరన్న నగర్ లో గల మున్సిపల్ స్కూల్ నందు స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్స్ భద్రపరిచారు కౌంటింగ్ నిమిత్తం హైస్కూల్ నందు మూడు గదుల్లో 4 టేబుల్స్ చొప్పున కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. మొదటి రౌండ్లో 12 టేబుల్స్ మీద 12 వార్డులు రెండో రౌండ్లో 13వ వార్డు నుంచి 24 నాలుగో వార్డ్ వరకు రెండవ రౌండ్ 25 వార్డు నుంచి 32 వ వార్డు వరకు 8 వార్డులకు మూడవ రౌండ్ లోని కౌంటింగ్ ను నిర్వహించనున్నారు. 

ప్రతి రౌండ్ లోను కౌన్సిలర్ అభ్యర్థితో పాటుగా చైర్మన్ అభ్యర్థి ఓట్లును లెక్కిస్తారు. మున్సిపల్ కార్యాలయంలో కౌంటింగ్ అధికారులకు ఆన్లైన్లో సోమవారం శిక్షణను ఇచ్చారు. కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్ పాసులను కమిషనర్ అందజేశారు .32 వార్డులలోను మొత్తం 69 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉండగా చైర్మన్ కోసం టిడిపి వైసిపి కాంగ్రెస్ బిఎస్పీ నుంచి నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. రామచంద్రపురం డిఎస్పి ఎం శేషు ఆధ్వర్యంలో సీఐ వెంకటనారాయణ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం సాయంత్రం ప్రధాన రహదారిలో పోలీస్ సిబ్బందితో కలిసి పెరేడ్ నిర్వహించారు.