BREAKING
8న పర్చూరులో మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటన విజయవంతం చేయాలి మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి వెల్లడి కడప పెద్ద దర్గా ఉర్సుకు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక అందించిన దర్గా పెద్దలు గిరిజనులకు న్యాయం చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించను రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి

నవంబర్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం తాహసిల్దార్ రాంప్రసాద్ రాజు

Select Suryaa Now
నవంబర్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం తాహసిల్దార్ రాంప్రసాద్ రాజు

ఉండి, మేజర్ న్యూస్:రైతులు తమకు సంబంధించిన భూముల వివరాలను సచివాలయ సిబ్బందికి అందించాలని ఉండి మండల తహసిల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు అన్నారు. మంగళవారం ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో గ్రామసభ నిర్వహించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉండి తహసిల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు మాట్లాడుతూ రాబోయే నవంబర్ సైకిల్‌లో ఉప్పులూరు, కోలమూరు  గ్రామాలకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా రైతుల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను గ్రామ సచివాలయంలో అందజేయాలని సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను సచివాలయ సిబ్బందికి అందించాలని తహసిల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు లోకం సుబ్బారావు, మాజీ సర్పంచ్ యర్రా దుర్గారావు, మాజీ ఎంపిటిసి నిమ్మల కేశవ కుమార్, ఇంచార్జ్ విఆర్వో బి శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

 

 రిపోర్టర్: రాజు.ఉండి పశ్చిమగోదావరి జిల్లా