BREAKING
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు

నర్సరీ మట్టి లారీలకు టోల్ ఫ్రీ ఇవ్వాలి

Select Suryaa Now
నర్సరీ మట్టి లారీలకు టోల్ ఫ్రీ ఇవ్వాలి

 

ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి

 కడియం, మేజర్ న్యూస్, అక్టోబర్ 5

 కడియం మండలం కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం అధ్యక్షుడు బోర్సు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరిని కలిసి నర్సరీ రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద మట్టి లారీలకు విధిస్తున్న రూ.1,280 టోల్, కాటా బిల్లును నర్సరీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మినహాయించాలని కోరారు. నర్సరీలకు మట్టి అత్యవసరమైన ముడిసరుకని, రవాణాపై అదనపు భారం పడటంతో చిన్న, సన్నకారు రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.రైతులకు మేలు జరిగేలా టోల్ మినహాయింపు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ పురందేశ్వరి హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పుల్లా శ్రీనివాస్, కార్యదర్శి పాఠంశెట్టి శ్రీనువాసు, సంయుక్త కార్యదర్శి అన్నందేవుల వెంకటేశ్వరరావు, కోశాధికారి డేగల రాము, సంయుక్త కోశాధికారి గట్టా కృష్ణ భగవాన్, కన్వీనర్ సానా రాజు, ప్రజా సంబంధాల అధికారి కామిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.