నరసాపురంలో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు! 216 జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు
నరసాపురం, సూర్య న్యూస్: నరసాపురం పట్టణంతో పాటు మండల పరిధిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ ఏడాదిలోనే ఇదే అతిపెద్ద వర్షమని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల్లో జనజీవనం స్తంభించింది.సీతారాంపురం రుస్తుంబాద, మొగల్తూరు, కొప్పర్రు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు సైతం అవస్థలు పడ్డారు.
ముఖ్యంగా 216వ జాతీయ రహదారిపై వర్షపు ప్రభావంతో కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.
రిపోర్టర్: ఇజ్రాయిల్ నరసాపురం పశ్చిమగోదావరి జిల్లా,