BREAKING
నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక.. తాడిగడప 13వ వార్డులో బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం అవనిగడ్డ మండలంలో రెండో రోజు కోలాహలంగా నామినేషన్లు

నైపుణ్య శిక్షణతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Select Suryaa Now
నైపుణ్య శిక్షణతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఇబ్ర‌హీంప‌ట్నం, మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంత మహిళల‌కు ఆధునిక నైపుణ్యాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా వివిధ శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం స్వయం సహాయక సంఘాలకు చెందిన 120 మంది మహిళలకు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యంత్రాల వినియోగంపై నిర్వహించిన వర్క్‌షాప్‌ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పరిశీలించారు. యూఎంఈ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యంత్రాల ద్వారా వస్త్రాలపై ఆకర్షణీయమైన డిజైన్లు, వివిధ రకాల ఎంబ్రాయిడరీ పనులను నాణ్యతతో, తక్కువ సమయంలో రూపొందించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షకురాలు శ్రేయా గుప్తా మహిళలకు యంత్రాల పనితీరు, వాటి నిర్వహణ, డిజైన్ల తయారీ, ఎంబ్రాయిడరీ ప్రక్రియలో పాటించాల్సిన మెళకువలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ ద్వారా తయారు చేయగల ఉత్పత్తులు, వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్, యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి, యంత్రాల నిర్వహణ ఖర్చులు, ఉత్పత్తి సామర్థ్యం, ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు, విక్రయ అవకాశాలు తదితర అంశాల‌ను వివ‌రించారు. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ నైపుణ్యాన్ని వినియోగించుకొని మహిళలు ఇంటి వద్దనే ఉపాధి పొందడంతో పాటు చిన్న తరహా వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశముందని తెలిపారు. శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ఆచరణలో పెట్టి నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లను రూపొందించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం ద్వారా వారిలో స్వయం ఉపాధి పట్ల ఆసక్తిని పెంపొందించి, ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నామ‌ని.. వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఏఎన్‌వీ నాంచార‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.