andhrapradesh
నగరి నియోజకవర్గంలో టీడీపీ హవా
తిరుపతి:తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) క్లీన్ స్వీప్ చేస్తూ బలమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. నియోజకవర్గంలోని మొత్తం 6 జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది.
పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన టీడీపీ అభ్యర్థులు ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో విజయ కేతనం ఎగరవేశారు.
ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే, మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకోగా, వైఎస్సార్ సీపీ (వైసీపీ) కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలతో నగరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.