నగర పంచాయతీ ఎన్నికలకు అదికారులు చకచకా ఏర్పాట్లు...
ముమ్మిడివరం మేజర్ న్యూస్ :మరో 13 రోజులు మాత్రమే నగర పంచాయతీ ఎన్నికలకు సంబందించి సమయం ఉండటంతో అదికారులు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికలకు సంబందించి 23 వార్డులలో గల 21,221 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 23 బూత్ లను ఏర్పాటు చేయనున్నారు.
గుర్తించిన ఈ పోలింగ్ బూత్ లను, ఎన్నిక అనంతరం బ్యాలెట్ బాక్స్కులు భద్రపరచనున్న, అనంతరం ఓట్ల లెక్కింపు జరగనున్న ముమ్మిడివరం జిల్లా పరిషిత్ బాలికల ఉన్నత పాఠశాలలో భవనాలను నగరపంచాయతీ కమీషనర్ రవివర్మ ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు..పోలింగ్ బూత్ ల వద్ద, స్ట్రాంగ్ రూమ్, కౌటింగ్ కేంద్రాలవద్ద కల్పించ వలసిన వసతులపై కమీషనర్, సిబ్బందితో చర్చించారు.
.నగర పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల స్వీకరణ దగ్గరనుండి, పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపినీ వరకు తీసుకోవలసిన జాగ్రత్త లపై సమీక్ష జరిపారు..ఈ సందర్బంగా కమీషనర్ రవివర్మ మాట్లాడుతూ ఎన్నికలకు సంబందించి ఏర్పాట్లు పగడ్బందీగా చేయడం జరుగుతుందని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే విదంగా సిబ్బందితో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.