BREAKING
భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు

నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి*   *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, అక్టోబర్ 19: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియను ఎన్నికల నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి  మున్సిపల్ కమిషనర్లను, రిటర్నింగ్ అధికారులను,  ఏఆర్వోలను ఆదేశించారు..

సోమవారం స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నిర్వహణ లో భాగంగా  అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణ , నామినేషన్ ల స్క్రూటినీ అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లు, ఆర్వో  లు, ఏ ఆర్వో లు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్లన పరిశీలించే సమయంలో   నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంలో జాప్యం జరగకుండా చూడాలని, తహశీల్దార్ల స్థాయిలో సమస్యలు ఎదురైతే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలన్నారు. నామినేషన్ల పరిశీలనలో ఏవైనా సందేహాలు తలెత్తితే ఎన్నికల మాన్యువల్‌తో పాటు ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఆర్వో  లు, ఏ ఆర్వో లు, తదితరులు పాల్గొన్నారు..