నామినేషన్ కేంద్రంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేయండి
కొత్తూరు, సూర్య : కొత్తూరు మండల పరిషత్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఎంపిటిసిల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహమ్మద్ ఖాన్ గురువారం పరిశీలించారు. జిల్లాలో ఎన్నికలు నామినేషన్లు ప్రశాంత వాతావరణం లో జరుగుతున్నాయని ఆయన అన్నారు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు మూడంచేల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి పటిష్టత భద్రత మధ్య నామినేషన్లు జరుగుతున్నాయని అన్నారు. వంద మీటర్లు దూరంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని, ఎందుకు చేయలేదని ప్రశ్నించగా ఎదురుగా ఉన్న తహసీల్దార్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పి సరోజినీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ముఖ్యనేతలు ఎవరైన నామినేషన్లు వేస్తే ఫొటోలు ప్రెస్ కు రిలీజ్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్నికల అధికారులను సూచించారు.
రిపోర్టర్ : సీతారామమూర్తి, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా.