BREAKING
అటవీ అమరవీరుల త్యాగం సిరస్మరణీయం ప్రతిరోజూ ఉదయం సోంపు వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య రహస్యాలు మీకోసమే! పాత కొమ్ముగూడెంలో పలు నిర్మాణ పనులకు శ్రీకారం చలికాలంలో ఈ ఏడు పొరపాట్లు అస్సలు చేయకండి.. చిన్న నిర్లక్ష్యమే పెద్ద అనారోగ్యానికి దారితీస్తుంది! ప్రతి రోజు ఒక గ్లాసు పసుపు పాలు తాగుతున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకోసమే! బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మున్సిపాలిటీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో  కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు. ఆమదాలవలస పట్టణంలో శారద కళ్యాణ మండపంలో మంగళవారం మున్సిపల్ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ  ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు 90 శాతం స్థానాల్లో విజయం సాధించి 4 ఎంపీపీ, 4 జడ్పీటీసీ స్థానాలు క్లీన్ స్వీప్ చేశారని పేర్కొన్నారు. ఈ ఫలితాలు పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు. అదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని మొత్తం 28 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రతి వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సమష్టిగా ఎన్నికల కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యత, సమన్వయం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, రాబోయే మున్సిపల్ ఎన్నికలను సమిష్టి బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల పరిపాలనలో మున్సిపాలిటీకి కోట్లాది నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్లాది రూపాయల నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. ఈ అభివృద్ధిని ప్రజలకు వివరించే బాధ్యత కూటమి నాయకత్వానికి ఉందని సూచించారు. మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డును కూటమి కైవసం చేసుకునేలా సమిష్టిగా ఎన్నికల్లో ఫలితాలు సాధించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కనితి విజయలక్ష్మి, టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, టిడిపి పట్టణ అధ్యక్షులు సంపద రావు మురళి, రాష్ట్ర కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.