మున్సిపల్ ఎన్నికలకు చక్రం తిప్పి సత్తా చాటిన ఆనం
ఆత్మకూరు మేజర్ న్యూస్ ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలకు కూటమి తరఫున చైర్మన్ అభ్యర్థి ఎవరు ఎవరు అనే సస్పెన్స్ కు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెరదించారు. ఆయన అనూహ్యంగా ఆలోచన చేసి చక్రం తిప్పి బలమైన బొమ్మిరెడ్డి కుటుంబం నుండి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా నిర్ణయించి పసుపు కండువాలు కప్పి నామినేషన్ల వేయించారు. అభివృద్దే ముఖ్యంగా అభ్యర్థిని ప్రముఖ రాజకీయ కుటుంబం అయిన బొమ్మిరెడ్డి కుటుంబంలోని యువ నేత బొమ్మిరెడ్డి తారక్నాథరెడ్డి ఆనం ఆహ్వానాన్ని శిరసావహించి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతోపాటు తన తల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కోడలు, దివంగత మాజీ మండల అధ్యక్షుడు డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి బి ఎస్ఆర్ హాస్పిటల్ ఎండిగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాను రాజకీయ రంగ ప్రవేశం చేయించడంతోపాటు ఆదివారమే చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తారకనాథరెడ్డి తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు తండోపతండాలుగా జనాలు, యువత మోటర్ బైక్ ర్యాలీలు,సందడే సందడి నెలకొంది. ఏదేమైనా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ఎవరో అనే ఉత్కంఠత 10రోజులుగా సాగుతూ పలువురి పేర్లు ప్రచారంలో ఉన్న రామ్ నారాయణ రెడ్డి రాజకీయ చతురతతో రాజకీయ అనుభవం, సమర్ధతతో ఎంత గోప్యంగా చక్రం తిప్పి బొమ్మిరెడ్డి కుటుంబం నుండి అభ్యర్థిని పోటీకి నిలిపి కూటమిలో జోష్ నింపారు.