BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

మున్సిపాల్టీల్లో ముగిసిన నామినేష‌న్ల‌ ప్ర‌క్రియ* *నేడు నామినేష‌న్ల ప‌రిశీల‌న‌*

Select Suryaa Now
మున్సిపాల్టీల్లో ముగిసిన నామినేష‌న్ల‌ ప్ర‌క్రియ*  *నేడు నామినేష‌న్ల ప‌రిశీల‌న‌*

పార్వతీపురం , అక్టోబ‌రు 18 : 

జిల్లాలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేష‌న్ల ప్రక్రియ ముగిసింది. శుక్ర‌వారం నామినేష‌న్ల‌ స్వీక‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్ట‌గా, ఆదివారంతో ఈ ప్ర‌క్రియ పూర్తి అయ్యింది. సోమవారం ప‌రిశీల‌న‌ ప్ర‌క్రియ జరుగనుంది.చివ‌రిరోజు కావ‌డంతో ఆదివారం నామినేష‌న్ల‌ను అంద‌జేయ‌డానికి వ‌చ్చిన అభ్య‌ర్ధుల‌తో కేంద్రాలు కిక్కిరిసి పోయాయి. నామినేష‌న్ కేంద్రాల‌వ‌ద్ద భారీ పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. అభ్య‌ర్ధితోపాటు మ‌రో ఇద్దిరిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించారు. వాహ‌నాల‌ను కేంద్రాల‌ను దూరంగా నిలిపివేసి, అభ్య‌ర్ధుల‌ను మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించారు. జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి ఆదేశాల‌కు అనుగుణంగా, ఆయా మున్సిపాల్టీల క‌మిష‌న‌ర్లు నామినేష‌న్ల‌ను అనుక్ష‌ణం ప‌ర్య‌వేక్షిస్తూ, నామినేష‌న్ల ప్ర‌క్రియ‌ను స‌జావుగా పూర్తి చేశారు. పార్వతిపురం 9. సాలూరు15  పాలకొండ 4 చొప్పున  నామినేష‌న్లు ఛైర్మ‌న్ పదవికి దాఖలవుగా. పార్వతిపురం 196. సాలూరు 202. పాలకొండ 120 చొప్పున వార్డు స‌భ్యులుగా నామినేషన్లు పడ్డాయి.

పి సతీష్ కుమార్. స్టాఫ్ రిపోర్టర్. పార్వతీపురం మన్యం జిల్లా