మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
* సీఈసీలో ఓట్ల లెక్కింపునకు పూర్తయిన ఏర్పాట్లు
* ఉదయం 7.30 ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
* చైర్మన్ ఓట్లకు నాలుగు రౌండ్లు లెక్కింపు
చీరాల: చీరాల మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం స్థానిక సీఈసీలో కౌంటింగ్ నిర్వహించనుండగా, ఉదయం 7.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది.అనంతరం కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థుల బ్యాలెట్ స్లిప్పులను వేర్వేరుగా విభజించి ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 44 వార్డుల కౌన్సిలర్ ఓట్లను రెండు రౌండ్లలో, చైర్మన్ అభ్యర్థుల ఓట్లను నాలుగు రౌండ్లలో లెక్కించనున్నారు.మొత్తం 44 వార్డుల్లో వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 163 మంది పోటీలో నిలిచారు. కౌంటింగ్‌లో గందరగోళం తలెత్తకుండా వార్డుల వారీగా బ్యాలెట్ స్లిప్పులను వేరు చేసేందుకు ప్రత్యేక ప్లాస్టిక్ బాక్స్ లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 4 గంటలలోపు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.