ముంజేరు ఎంపీటీసీ బరిలో దువ్వు భవాని
భోగాపురం, సూర్య : ముంజేరు ఎంపీటీసీ అభ్యర్థిగా దువ్వు భవాని ఎన్నికల బరిలో నిలిచారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. బీటెక్ విద్యార్హత కలిగిన భవాని స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆమె భర్త వందనాల రమణ జనసేన మండల అధ్యక్షుడిగా, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన రాజకీయ పరిచయాలు, క్షేత్రస్థాయి అనుభవం భవాని అభ్యర్థిత్వానికి ప్రాధాన్యం సంతరించుకునేలా చేస్తున్నాయి. రమణ రాజకీయ అనుభవం, భవాని విద్యార్హత కలగలిసి ముంజేరు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆమెకు ఎంతవరకు కలిసివస్తాయో వేచి చూడాలి.
రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.