ముగిసిన ‘పుర’ నామినేషన్ల పర్వం
చివరి రోజున పెద్ద సంఖ్యలో దాఖలు
చిత్తూరు జిల్లా బ్యూరో మేజర్ న్యూస్: జిల్లాలోని కార్పొరేషన్, పురపాలక సంఘాల సాధారణ ఎన్నికలకు సంబంధించిన మూడు రోజుల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు కుప్పం, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో పార్టీల వారీగా నమోదైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు నగరపాలక సంస్థ: (వార్డులు: 60)
*మేయర్ పదవికి మొత్తం: 14: టీడీపీ - 6, వైసీపీ- 3, కాంగ్రెస్- 1, స్వతంత్రులు - 4.
*కార్పొరేటర్ సభ్యులు: (మొత్తం నామినేషన్లు: 606): టీడీపీ - 271, వైసీపీ - 177, జనసేన - 37, బీజేపీ - 19, ఎస్‌డీపీఐ - 4, జేడీఎస్ - 2, సీపీఐ - 1, కాంగ్రెస్ - 1, స్వతంత్రులు - 94.
కుప్పం పురపాలక సంఘం (వార్డులు: 32)
ఛైర్‌పర్సన్ పదవికి (మొత్తం 18): టీడీపీ - 8, వైసీపీ - 6, బీఎస్పీ - 1, కాంగ్రెస్ - 1, ఇండిపెండెంట్లు - 2.
*వార్డు సభ్యులు (మొత్తం నామినేషన్లు: 282): టీడీపీ - 146, వైసీపీ - 99, జనసేన - 13, బీజేపీ - 2, ఇండిపెండెంట్లు - 22.
నగరి పురపాలక సంఘం: (వార్డులు: 40)
*ఛైర్‌పర్సన్ పదవి (మొత్తం 14): వైసీపీ - 10, టీడీపీ - 3, ఇండిపెండెంట్లు - 1.
*వార్డు సభ్యులు (మొత్తం నామినేషన్లు :283): వైసీపీ - 130, టీడీపీ - 121, బీజేపీ - 6, జనసేన - 3, కాంగ్రెస్ - 2, బీఎస్పీ - 1, ఇండిపెండెంట్లు - 19.
పలమనేరు పురపాలక సంఘం (వార్డులు:36)
ఛైర్‌పర్సన్ పదవికి (మొత్తం 8 నామినేషన్లు). టీడీపీ - 3, వైసీపీ - 3, కాంగ్రెస్ - 1, ఇండిపెండెంట్లు - 1.
*వార్డు సభ్యులు (మొత్తం నామినేషన్లు: 150: టీడీపీ - 69, వైసీపీ - 62, జనసేన - 6, బీజేపీ - 3, ఇతర పార్టీలు - 6, ఇండిపెండెంట్లు - 6.