బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ
చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.
చేవెళ్ల - మేజర్ న్యూస్