BREAKING
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు! తెలంగాణకు వర్ష గండం.. 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! 19 సంవత్సరాల యువకుడి దారుణ హత్య మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు విజయం కోసం సమష్టిగా పనిచేస్తామని నాయకుల హామీ నారాయణ పేట జిల్లాలో నిలిచిపోయిన మిషన్ భగీరథ.. పల్లెల్లో తాగునీటి గోస! ఎన్నికల వ్యూహాలపై రమేష్ గౌడ్ ప్రత్యేక సమీక్ష మేయర్ ఎన్నికల్లో సహకరించాలి.. అన్ని వర్గాలకు పిలుపు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: చిట్లూరు రమేష్ గౌడ్ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొక్కిరాల సురేఖమ్మ వీధి వ్యాపారులను స్మార్ట్ ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ వినూత్న ఆవిష్కరణ: ఫ్రాన్స్ అల్లర్లలో పెను విషాదం: రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన 143 ఏళ్ల చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు.. కుప్పకూలిన బెల్ టవర్! నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు రెస్టారెంట్ సర్వర్‌ను నమ్ముతారు కానీ గ్రోక్ (Grok) ఏఐని నమ్మరా?: క్రెడిట్ కార్డు ప్రైవసీ ఆందోళనలపై ఎలాన్ మస్క్ ఎదురుదాడి! నవంబర్ 1 నుంచి మొబైల్ యూజర్లకు కొత్త రూల్: ఇన్‌కమింగ్ కాల్స్‌పై కాలర్ అసలు పేరు డిస్‌ప్లే.. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. చెన్నైలో దంచికొడుతున్న వానలు తిరుమలలో నేటి ఉదయం స్వర్ణ రథోత్సవం.. రాత్రి అశ్వ వాహనంపై శ్రీనివాసుడు ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

గణపురం,  మేజర్ న్యూస్, గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ కొడారి హైమావతి–ధనుంజయ్‌ యాదవ్‌ పర్యవేక్షణలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పారు. పండుగ ప్రాంగణాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించడంతో వేడుకలకు మరింత శోభ చేకూరింది. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గణపురం ఎస్‌ఐ బొరగల అశోక్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.

రిపోర్టర్ ;ఎల్లయ్య, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా