సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొక్కిరాల సురేఖమ్మ
• ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు
సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల జిల్లా ప్రతినిధి : సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్, వెంకట్రావుపేట, దౌడపల్లి, పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు, సర్పంచ్ నలిమెల రాజు, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ అలీ, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.