BREAKING
ఏపీకి వర్షాలు, అల్పపీడన ముప్పు: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎం. అరవింద్ కుమార్ యాదవ్ వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ విజయానికి కృషి చేద్దాం.. - సిపిఐ నాయకులు ఘనంగా...శ్రీ మైసమ్మ తల్లి తెప్పోత్సవం ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి వైష్ణవి చైతన్య రాజ రాజేశ్వరిగా బెజవాడ కనకదుర్గమ్మ పంజాబ్‌లో అమిత్ షా పర్యటన.. సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ సమాజానికి క్షమాపణ చెప్పాలి..ప్రముఖ గాయకుడు అనూప్ జలోటా! పాక్‌కు ఆయుధ సాంకేతికతపై ప్రపంచం అప్రమత్తంగా ఉండాలి: ఐరాసలో భారత్! పెళ్లిలో మా అమ్మమ్మ సంప్రదాయ నౌవారి చీర ధరించా: 27 ఏళ్ల నాటి పెళ్లి జ్ఞాపకాలను నెమరువేసుకున్న మాధురీ దీక్షిత్! విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి గాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి: బెంగళూరులో సురక్షితంగా ల్యాండింగ్. అణ్వాయుధ రహిత ప్రపంచ సాధనకు భారత్ కట్టుబడి ఉంది: అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: రైతులకు పూర్తి రక్షణ.

లక్ష్మినారాయణపూర్‌లో విషాదం.. ఆర్మీ జవాన్ మల్లేశం మృతి

Select Suryaa Now
లక్ష్మినారాయణపూర్‌లో విషాదం.. ఆర్మీ జవాన్ మల్లేశం మృతి


యాలాల,మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మినారాయణపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బోయిని మల్లేశం మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన సోమవారం ఉదయం మృతి చెందినట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుండగా, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన మల్లేశం సైన్యంలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలిచారు. తన ముగ్గురు అక్కాచెల్లెళ్ల వివాహాలను ఘనంగా నిర్వహించి కుటుంబ బాధ్యతలను నెరవేర్చారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో ఆర్మీ విధులు నిర్వహిస్తున్న ఆయన దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.