19 సంవత్సరాల యువకుడి దారుణ హత్య
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున జనగామకు చెందిన బొంత సంతోష్ (19) అనే యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే యువకుడి హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది