పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉదయం బోడుప్పల్‌లోని శ్రీ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దివ్య ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.పుట్టినరోజు సందర్భంగా ఆలయానికి చేరుకున్న తోటకూర వజ్రేష్ యాదవ్‌కు అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రిపోర్టర్: పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.