గాజులమండ్యం కూడలి వద్ద బోల్తాపడిన కాటన్ లారీ.
రేణిగుంట మేజర్ న్యూస్ : రేణిగుంట రూరల్ ప్రాంతంలో గాజులమండ్యం కూడలి వద్ద కాటన్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. శ్రీకాళహస్తి వైపు నుంచి వస్తున్న లారీ, ముందుగా వెళ్తున్న ప్రైవేట్ యాడ్ ఏజెన్సీకి చెందిన టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనానికి ఏర్పాటు చేసిన బ్యానర్లు చిరిగిపోయాయి. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న గాజులమండ్యం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.